
నేటి సాక్షి, కరీంనగర్: ఈనెల 9వ తేదీన హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్న అఖిల భారత పద్మశాలి మహాసభ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయడానికి పద్మశాలి సమాజంలోని వివిధ రంగాలలో ఉన్న పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో తరలిరావాలని కరపత్రాన్ని ఆవిష్కరించారు. పద్మశాలి సమస్యలపై చేనేత రంగాల వృత్తుల సమస్యలపై ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనాలకై మనకు కావలసిన సబ్సిడీలు మన వాటాలకై చేనేత కార్మికుల సమస్యలపై హలో పద్మశాలి… చలో హైదరాబాద్ అఖిల భారత పద్మశాలి సంఘం ధార్మిక విభాగం కార్యదర్శి పద్మకుల రత్న చిలుక నరసప్ప పద్మశాలి పిలుపునిచ్చారు.



