- మీ కుటుంబానికి మీరే రక్ష హెల్మెట్ మీకు రక్ష
- అర్బన్ సి ఐ చంద్ర శేఖర్ ట్రాఫిక్ సి ఐ విశ్వనాధ రెడ్డి
- రాయచోటి పట్టణంలో హెల్మెట్ వాడకం పై అవగాహనా ర్యాలి
నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ :
హెల్మెట్ ను బరువుతో కాకుండా బాధ్యతతో దరించి సురక్షితంగా ప్రయణిచాలని వాహనదరులను ట్రాఫిక్ సి ఐ విశ్వనాధ రెడ్డి, అర్బన్ సి ఐ చంద్ర శేఖర్ లు కోరారు. అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు రాయచోటి డివిజన్ డిఎస్పి కృష్ణ మోహన్ నేతృత్వంలో రాయచోటి పట్టణంలో హెల్మెట్ వాడకం పై బైక్ ర్యాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి ర్యాలీని అర్బన్ సి.ఐ. చంద్రశేఖర్ జెండాను ఎత్తి ప్రారంబించారు. స్థానిక శివాలయం నుండి ఎస్ యాన్ కాలని, నేతాజీ కూడలి, బస్టాండ్ సర్కిల్, నాలుగు రోడ్ల సర్కిల్ మీదగా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలిని కొనసాగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రోడ్డు పై ద్విచక్రవహనం నడిపే ప్రతి ఒక్కరు కుడా హెల్మెట్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలని ఆదేశించారు. లక్షలాది రూపాయలు వ్యయం చేసి బైక్ లు కొన్నవారు హెల్మెట్ వాడక పోవడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు.