Tuesday, March 17, 2026

పేదోడికి సాయం, దివ్యాంగురాలికి ఉద్యోగం

  • కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా కిచ్చెన్న- కేఎల్ఆర్

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): ఆపదొచ్చినా, అవసరమోచ్చినా, మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారు. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. రోజూ కార్యాలయానికి వందలాది మంది వివిధ పనుల కోసం వస్తుంటారు. వెంటనే చకచక పనులు చేసి పెట్టే నైజం కేఎల్ఆర్ సొంతం. మహేశ్వరం మండల పర్యటనలో లక్ష్మారెడ్డి… కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచారు. ఈమధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోయిన పోరండ్ల గ్రామానికి మదిలాపురం శ్రీనివాస్ కుటుంబాన్నిపరామర్శించారు.ఆర్థిక సహాయం చేయటమే కాకుండా పిల్లల చదువుకు భరోసా, శ్రీనివాస్ ముదిరాజ్ భార్య లావణ్యకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు కేఎల్ఆర్. కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన కిచ్చెన్నకు పోరండ్ల సహా నియోజకవర్గ క్యాడర్ కృతజ్ఞతలు తెలిపారు.అంతకు ముందు కందుకూరు మండలం కేంద్రంలో ఓ దివ్యాంగురాలు లక్ష్మారెడ్డిని కలిసి కుటుంబ పరిస్థితిని వివరించారు. ఎంకామ్, బీఎడ్ పూర్తి చేసిన ప్రేమలతకి తగిన ఉద్యోగం వచ్చేలా సంబంధిత వ్యవస్థలతో మాట్లాడాలని పీఏను ఆదేశించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News