Tuesday, March 24, 2026

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సహకరించండి

  • కమిషనర్ ఎన్.మౌర్య

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అందరూ కలసి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శుక్రవారం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, దుకాణాల యజమానులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా జీవనానికి హానింకలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు నగరంలోని ప్రతి ఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరంలో ర్యాలీలు నిర్వహిస్తామని, ప్రచారం కల్పించనున్నమని తెలిపారు. అలాగే అన్ని దుకాణాల వారు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా గుడ్డ బ్యాగుల ఇవ్వడం, పేపర్ కవర్లు వాడడం, మాంసాహార దుకాణాల వారు టిఫిన్ బాక్సులు వినియోగించడం వంటివి చేయడం వలన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగానికి కృషి చేసినా తిరుపతి చుట్టుపక్కల నుండి ఎక్కువగా వస్తున్నాయని పలువురు తెలిపారని అన్నారు. కలెక్టర్ తో చర్చించి తిరుపతి చుట్టుపక్కల కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.లు రాజు, మహేష్, మధు, రమణ, లలిత, రెవెన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, సెక్టోరల్ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News