Friday, March 20, 2026

స్నేహితుడి కుటుంబానికి చేయూత

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): తనతో పాటు కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతడి కుటుంబానికి తోటి స్నేహితులు ఆర్థిక సహయంతో చేయూత అందించి అండగా నిలిచారు. మండల కేంద్రానికి చెందిన చీకటి వెంకటేష్ ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపధ్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అతడి సహచర పదవ తరగతి బ్యాచ్ (1990-1991) కు చెందిన పూర్వపు స్నేహితులు తమవంతుగా చేయూత అందించాలని తలచి తమకు తోచిన విధంగా జమచేసి ఆర్థిక సహయం అందజేశారు. శనివారం మిత్రుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.21500 వేలు నగదును వారికి అందజేసి అండగా ఉంటామని భరోసానిచ్చారు. స్నేహం అన్న మాటకు సరైన నిర్వచనాన్నిస్తూ మృతుడి కుటుంబానికి మేమున్నామని ఆర్థిక సహయంతో స్పందించిన స్నేహితుల తీరు ఆదర్శంగా నిలిచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News