- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామనికి చెందిన ఎలుగం రాజు తన కుమార్తె ఐన ఎలుగం భార్గవి చిన్నతనం నుండి చదువులో అత్యంత ప్రతిభను కనపరిచి మోడల్ స్కూల్లో అత్యధిక మార్కులతో బాసర త్రిబుల్ ఐటీ లో ఫ్రీ సీటును పొందిన భార్గవి మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసింది.ఈ నెల 2 వ తారీకు న గేట్ పరీక్ష రాయాల్సి ఉండగా అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగిన కాలు విరిగిన సందర్భంలో ఆపరేషన్ చేసి రాడ్ వేయటం జరగటం తో గేట్ పరీక్ష రాయలేక పోయినది.తన ఉన్నత చదువులకు కోచింగ్ ఆన్లైన్ ద్వారా నేర్చుకోవాలని పట్టుదల తో ఉన్న భార్గవి కి భారతీయ జనతా పార్టీ భీంపల్లి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్ తో కలిసి భార్గవి పరిస్థితిని కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లడంతో మానవతా దృక్పథంతో స్పందించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే భార్గవి కి లాప్ టాప్(HP కంపెనీ ) అందిచడం జరిగింది. ఈ సందర్భంగా ఎలగం రాజు, భార్గవి మరియు కుటుంబ సభ్యులు బండి సంజయ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, మండల నాయకులు భూపతి ప్రవీణ్,భీంపల్లి బూత్ అధ్యక్షులు వాసాల సత్తయ్య, సులుగూరి శ్రీనివాస్,కుర్మిండ్ల సంతోష్,ఎగ్గొజు శ్రీనివాస్, ఆకినపెల్లి రవీందర్,చింతల రంజిత్,ఎలుగం సారయ్య పాల్గొన్నారు.



