- జిల్లా జస్టిస్ వి బీ నిర్మల గీతాంబ
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కుటుంబ, ఆస్తి తగాదాలు కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండేందుకు మద్య వర్తిత్వం ద్వారా నే సమస్యలకు పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్, వరంగల్ జిల్లా జడ్జీ వి బి నిర్మల గీతాంబ అభిప్రాయ పడ్డారు. మధ్య వర్తిత్వం వ్యవస్థను పెద్ద ఎత్తున అమలు పర్చడానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజన్ పాల్ శ్రీకారం చుట్టారని గీతాంబ తెలిపారు. ఇప్పటికే సమాజం లోని అనేక సామాజిక రుగ్మతలు, క్షణికావేశం వల్ల జరిగే అనర్థాలను స్థానికంగా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించ బడుతున్నా ఇంకా చట్టాలపై అవగాహన పెంచి కోర్టు మెట్లు ఎక్కకుండా మధ్య మర్తిత్వ వ్యవస్థను పటిష్టం చేయడానికి న్యాయ స్థానాలు కంకణం కట్టుకున్నాయని గీతాంబ పేర్కొన్నారు. మధ్య వర్తిత్వం ద్వారా కక్ష దారుల మధ్య పగలు, పట్టింపులు, ప్రతీకారాలు, కక్షపూరిత చర్యలకు తావు ఉండదని గీతాంబ స్పష్టం చేశారు. ఏలాంటి ప్రయోజనం చూసుకోకుండా సామాజిక సేవా ధృక్పథం కలిగిన వివిధ సామాజిక వర్గాల నుండి హన్మకొండ, వరంగల్ జిల్లాల లీగల్ సెల్ అథారిటీ న్యాయ సలహా దారులను ఎంపిక చేయడం జరిగిందనీ తెలిపారు. వీరి సహకారంతో మరికొన్ని చిన్నచిన్న తగాదాలు కోర్టు మెట్లు ఎక్కకుండా ఉంటే అంతే చాలు అని ఆమె అన్నారు. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్ష దారులకు లోక అదాలత్ ద్వారా రాజీ కుదిర్చి కేసులను పరిష్కరిస్తున్నామని,ఈ ప్రక్రియ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగ కూడదనే లక్ష్యంతో మధ్య వర్తిత్వం మార్గాన్ని ఎంచుకున్నామని గీతాంబ తెలిపారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల నుండి ఎంపిక చేసిన న్యాయ సలహా దారులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ ఆదేశాల మేరకు చట్టాల పై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 8 న ఉదయం కాళోజీ కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన మధ్య వర్తుల సదస్సుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ హాజరవుతారని గీతాంబ తెలిపారు. సమాజంలో నిత్యం సామాజిక సేవా కార్య క్రమాల్లో పాలు పంచుకుంటున్న న్యాయ సలహా దారులు ఈ సదస్సు లో పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ కార్య క్రమంలో వరంగల్, హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, మాతంగి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి మహ్మద్ ముదాషీర్, ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ గౌరవ సలహా దారులు వేముల సదానందం నేత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు వడ్నాల నరేందర్, ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకులు మంద కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.



