Monday, March 16, 2026

కోర్ట్ భవనాలకు శంకుస్థాపన చేసిన హై కోర్ట్ న్యాయమూర్తులు

నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో రెండు కోర్ట్ ల నూతన భవనా లకు తెలంగాణ హై కోర్ట్ న్యాయ మూర్తులు జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ లక్ష్మీనారాయణ అదిశెట్టి, గార్లు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వించారు. అనంతరం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, రెండు కోర్ట్ భవనాలు మరియు రెండు వసతి గృహాల, నిర్మాణం కొరకు 25. 02 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఎల్లారెడ్డిప్రస్తుతం ఉన్న కోర్ట్ భావనము, 1936 నిర్మించడం జరిగిందని అన్నారు. బాన్స్ వాడ కోర్ట్ భవనం, 1987 నిర్మాణం చేసినప్పటికి, ప్రస్తుత కాలనుకులకంగా, బాన్సువాడ కు సహితం, నూతన కోర్ట్ భావనము మంజూరు చేయడం జరిగిందని గౌరవ న్యాయమూర్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామరెడ్డి జిల్లా న్యాయమూర్తి వి.ఆర్ ఆర్. వర ప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాదు జిల్లా బార్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, స్థానిక ఎల్లారెడ్డి కోర్టు న్యాయమూర్తి గౌడ్ల హారిక, న్యాయమూర్తులు, ఎల్లారెడ్డి బార్ అధ్యక్షులు గోపాల్ రావు, పలువురు న్యాయవదులు, పలు శాఖ ల అధికారులు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీ.ఐ రవీందర్ నాయక్, ఎస్.ఐ మహేష్, ఆంజనేయులు, కోర్టు సిబ్బంది మరియు పోలీసు సిబ్బది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News