నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఇంటి ముంగిట ఈరోజు హైదరాబాదులో అలంపూర్ మరియు గద్వాల తాలూకా ముఖ్య నాయకులు తో కలిసి సంపత్ కుమార్ హోలీ సంబరాలు చేసుకున్నారు.
మన దేశ సంప్రదాయాలకు ప్రతీకగా ఉన్న హోలీ పండుగను పురస్కరించుకొని ఒకరికొకరు సాంప్రదాయ రంగులతో హోలీ పండుగను శుక్రవారం హైదరాబాదులోని సంపత్ కుమార్ గారి నివాసంలో తన ముఖ్య నాయకులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరితో పాటు రాష్ట్ర ప్రజలు నా తాలూకా ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో తులతూగాలని ఈ పండుగ సందర్భంగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మరియు అలంపూర్ తాలూకాకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.





