Wednesday, April 1, 2026

హోలీ పండుగను సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలి

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్…!!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :

మద్యం సేవించి బైకులపై పెద్ద శబ్దాలు చేస్తూ గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి,రంగుల హోలీ మీ జీవితాలలో వెలుగులు నింపాలని కోరు కుంటూ జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ. వనపర్తి జిల్లా ప్రజలు హోలీ పండగను సంప్రదాయ పద్ధతుల్లో ప్రకృతిలో లభించే, చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని న్యాచురల్ కలర్స్ ను వినియోగించి, ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సా హాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు మరియు వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని విసరడం కఠినంగా నిషేధించబడింది జిల్లా ప్రజలు,యువత మద్యం సేవించి వాహనాలను నడపడం, బహిరంగ ప్రదేశాలపై, ఇష్టం లేని వ్యక్తులపై, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లకూడం వంటివి చేయకూడదు అన్నారు. బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అట్టి వ్యక్తులపై చట్టరిత్య చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలను తరుచూ గమనిస్తూ వారికి సరైన మార్గాలను నిర్దేశించాలన్నారు. యువత వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, రేష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, లాంటివి మానుకోవాలని సూచించారు. హోలీ పండగ సందర్భంగా 14-03-2025 నాడు 6:00 గంటల నుండి 12 గంటల వరకు హోలీ పండుగ జరుపుకోవాలని ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా సున్నిత ప్రదేశాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు.ఏదైనా అత్యవసర పరిస్థితిలో 100 డయల్ చేయాలని సూచించారు. ఈ హోలీ మీ జీవితాలలో రంగులు నింపాలని కోరుకుంటూ వనపర్తి జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ హోలీ పండగ శుభాకాంశాలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News