- పట్టణ ప్రజలకు సీఐ సూచనలు
నేటి సాక్షి, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పట్టణ సీఐ వరంగంటి రవి హోలీ సందర్భంగా స్థానికులతో మరియు బిర్యానీ పాయింట్ సెంటర్ వారితో మాట్లాడి రాత్రి 10 గంటల వరకు బిర్యాని పాయింట్ మూసివేయాలని మరియు హోలీ రోజున వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ వెళ్లకూడదని మరియు రోడ్లపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని, వాహనాలపై వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ,ప్రశాంత వాతావరణంలో వారి వారి ఇంటి వద్ద హోలీ సంబరాలు జరుపుకోవాలని సిఐ సూచించారు.





