Tuesday, March 31, 2026

గ్రూప్ వన్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థికి సన్మానం

  • మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : కొత్తకోట పట్టణానికి చెందిన మండ్ల పవన్ కుమార్ నాయుడు గ్రూప్ వన్ ఫలితాల్లో సత్తా చాటి తన తాత స్వర్గీయ మండ్ల చంద్రయ్య ఆశయాలను నెరవేర్చాడు. కొత్తకోట మండల పరిధిలోని వడ్డెవాట గ్రామానికి చెందిన మండ్ల పుష్పలత వెంకటస్వామిల ఏకైక పుత్రుడు మండ్ల పవన్ కుమార్.మండ్ల వెంకటస్వామి ప్రస్తుతం కొత్తకోట పట్టణంలోనే స్థిర నివాసిగా ఉంటూ, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రైటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కొడుకు గ్రూప్ వన్ లో ప్రతిభను కనబరిచినందుకు వెంకటస్వామి దంపతులకు పవన్ కుమార్ కు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్,మాజీ సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, నాయకులు రామకృష్ణాపురం యుగంధర్ రెడ్డి, వాకిటి బాలరాజు, కృపాకర్ రెడ్డి, మాధవరెడ్డి, మహంకాళి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News