Thursday, April 2, 2026

హోప్ స్వచ్చంద సంస్థ విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ పంపిణి

నేటిసాక్షి/మంగపేట : మంగపేట మండలం కమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు హోప్ స్వచ్చంద సంస్థ ద్వారా పరీక్ష మెటీరియల్ అందిచడమైనది. ఈ సందర్బంగా హోప్ సంస్థ అధ్యక్షులు ఖళీద్ మాట్లాడుతూ హోప్ సంస్థ చేస్తున్న చిన్న చిరు కానుకగా భావించాలి విద్యార్థులు పరీక్షలు బాగా రాసి ఉన్నతమైన చదువులు చదివి అత్యుత్తమైన స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నాను మీ మీద మీ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఉపాధ్యాయులు లకు మంచి పేరు తీసుకురావాలని కోరారు విద్యార్థులు అతి వేగంగా బైక్ రైడ్ చేసి ప్రమాదాలకు గురి కావొద్దు అని కోరారు.. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు డ్రగ్స్ కు బానిసలుగా మారొద్దు అని పిలుపునిచ్చారు. హోప్ సంస్థ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమం లో హోప్ సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఖాలీద్ హుస్సేన్ . ఆర్గనైజయింగ్ సెక్రటరీ సుంకోజు ప్రశాంత్, ఉపాధ్యాయులు ప్రసాద్ సునీత రమేష్ నాగలక్ష్మి నాగమ్మ లావణ్య మౌలాలి హోప్ సభ్యులు సాయి గణేష్, అసిఫ్ రాజు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News