Thursday, April 2, 2026

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

నేటి సాక్షి,కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం లోని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ ఆధ్వర్యంలో భీంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జవ్వాజి కుమార్, మాజీ వార్డు మెంబర్లు తాళ్లపల్లి గణేష్, ఎలగం రవి, రహమతుల్లా రఫీ, గుంపుల జైపాల్ తో సహా 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై ప్రణవ్ నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినామని మాజీ సర్పంచి జవ్వాజీ కుమార్ తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్, టిపిసిసి సోషల్ మీడియా కార్యదర్శి వాసాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండపు చరణ్ పటేల్, బాలసాని రమేష్ గౌడ్, పుల్లూరి శ్రీనివాసరావు, పోడేటి బిక్షపతి, కేత్తే రవి, భీంపల్లి గ్రామ అధ్యక్షులు కుక్కల ఓదెలు, మార్కెట్ డైరెక్టర్ ఆకినపల్లి బిక్షపతి, పైసా శరత్, తోట శంకర్, మహమ్మద్ తాజ్, కొల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News