నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : నేడు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో బిజేపి సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో సిక్కు మతస్తుల గురువు గురుగోబింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రత్యేక ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా రామగుండం ఇన్‌చార్జ్ కందుల సాంధ్యారాణి హాజరై ర్యాలిని ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ.. గురుగోబింద్ సింగ్. ధర్మం కోసం, ప్రజల కోసం అందించిన సేవలను, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా గురుగోబింద్ సింగ్ జయంతి ఉత్సవం మనందరికీ ప్రేరణ కలిగించే పర్వదినమని అన్నారు. కార్యక్రమంలో సాంధ్యారాణి తమ ప్రత్యేక ప్రతిభతో కర్రసాము ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనపై సిక్కు సమాజం సభ్యులు ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో బిజేపి సీనియర్ నాయకులు మేరుగు హన్మంతు గౌడ్, కోమల మహేష్, పల్లికొండ నర్శింగ్ మరియు రఘుబీర్ సింగ్ , భీం సింగ్, అజీత్ సింగ్, బచన్ సింగ్, విక్రం సింగ్, రంజీత్ సింగ్, మంగల్ సింగ్, డోనాలత్ సింగ్, జర్నల్ సింగ్, అర్జున్ సింగ్, జీత్ కౌర్, కమల్ కౌర్, బసత్ కౌర్, రాజ్ కౌర్, అన్ను కౌర్, కిరణ్ కౌర్ తదితరులు పాల్గోన్నారు.

