- కలెక్టర్ కు పిర్యాదు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కొరకు ప్రవేశపెట్టిన నేతన్నకు చేయూత (త్రిఫ్ఠ్ ఫండ్) స్కీం నందు దాదాపు 70 నుండి 80 లక్షల వరకు ఫ్రాడ్ జరిగిందని ప్రియదర్శిని మహిళా చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు బుధార్పు సత్యమ్మ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కు చేనేత కార్మిక సంఘం నాయకులు పిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన జియో టాక్ నెంబర్లను చేనేత కార్మికులకు తెలియకుండా ఆ నెంబర్ పై కోట్ల రూపాయల చీరల వ్యాపారం చేసేటటువంటి వ్యాపారులు చేనేత కార్మికుల ముసుగులో లక్షల రూపాయలు లబ్ధి పొందడం జరిగిందని,ఈ విషయంపై విచారణ జరిపించి ఇందుకు పాల్పడినటువంటి వారిపై చేనేత జైళి శాఖ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని తెలిపారు.





