Thursday, March 12, 2026

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురై జీవితంపై విరక్తితో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎండపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఆర్.ఉమా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మానుపాటి రమేష్ (30) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతడికి భార్య పద్మ, ఒక్క కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ కుటుంబంలో సంసార కలహల నేపథ్యంలో ఇతడిపై తన భార్య పద్మ గతంలో (2017) కేసు నమోదు చేసి తన పుట్టింటికి (వెదురుగట్ట) వెళ్లిపోయింది. దీంతో చేసేదేమి లేకా రమేష్ తన భార్య పిల్లల వద్దకు వెళ్లి అక్కడే ఉంటూ అప్పుడప్పుడు తన తల్లీ వద్దకు వచ్చి వెళ్లేవాడు. కాగా గత 4 నెలల క్రితం అక్కడ ఉండాలేక తిరిగి స్వగ్రామం ఎండపల్లికి వచ్చి తన తల్లీ దగ్గర ఉంటున్నాడు. ఇదే క్రమంలో నా భార్య కాపురానికి ఇక్కడికి రావడం లేదని, నన్నే తన వద్దకు వచ్చి అక్కడే ఉండామంటున్నదని నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదని పలుమార్లు తన తల్లీతో భాదపడుతూ ఒంటరిగా బతుకలేక పోతున్న చనిపోతానాని రమేష్ ఆవేదన చెందేవాడు. ఇదే మనస్థాపంతో ఎవరులేని సమయంలో శనివారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని తుమ్మ చెట్టుకు రబ్బరు తాడుతో ఉరి వేసుకుని రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లచ్చవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహనికి పంచనామ నిర్వహించినట్లు వెల్లడించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News