Wednesday, March 25, 2026

విడాకులు ఇవ్వకుండానే భర్త రెండో పెళ్లి

  • పోలీసులను ఆశ్రయించిన మహిళ

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో (రాధారపు నర్సయ్య) : విడాకులు ఇవ్వకుండానే తన భర్త తన మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడంటూ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన మంజుల 2012 సంవత్సరంలో సోమన్ పల్లి గ్రామానికి చెందిన గోపిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో గోపి తనకు విడాకులు కావాల్సిందిగా కోర్టు ద్వారా మంజులకు నోటీసులు పంపించాడు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే గోపి మరో మహిళను వివాహం చేసుకున్నాడంటూ మంజుల శుక్రవారం డిఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను పెళ్లి చేసుకున్న గోపి పై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది. కాగా తనను పెళ్లయిన కొద్ది రోజులకే వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారని ఈ విషయమే ఇదివరకే బుగ్గారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా వివరించింది. తనకు తన పిల్లలకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరింది.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News