నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్. సి (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో తేదీ: 15-03-2025 రోజున నిర్వహించిన బడ్జెట్ సమావేశములో 2025-26 ఆర్ధిక సం.నకు గాను రూ. 14,24,60,000/- ల బడ్జెట్ ప్రతిపాదనలను హుజురాబాద్ పురపాలక సంఘ ప్రత్యేక అధికారి శ్రీ ప్రఫుల్ దేశాయ్, IAS ఆమోదము తెలిపినారు. అట్టి వాటి వివరములు ఈ దిగువ తెలిపిన విధముగా కలవు. 2025-26 సం. సాధారణ నిధుల అంచనా ఆదాయము రూ. 9,33,60,000/-
ప్లాన్, నాన్ ప్లాన్ & ఇతర నిధుల అంచనా ఆదాయము రూ. 4,91,00,000/-
మొత్తం అంచనా ఆదాయము రూ. 14,24,60,000/-, 2025-26 సం. సాధారణ నిధుల అంచనా వ్యయము రూ. 9,33,59,000/-
ప్లాన్, నాన్ ప్లాన్ & ఇతర నిధుల అంచనా వ్యయము రూ. 4,91,00,000/-
మొత్తం అంచనా వ్యయము రూ. 14,24,59,000/-, ఇట్టి కార్యక్రమము నందు కమిషనర్ కె. సమ్మయ్య, జూనియర్ అకౌంట్స్ అధికారి జి. సంధ్యారాణి, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ జి. సాంబరాజు, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ N. అశ్వినీ గాంధీ, ఇంచార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్ MD. రషీద్, జూనియర్ అకౌంటెంట్ CH. గోపాల్, అకౌంట్స్ సెక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ బండ వెంకటేష్ పాల్గొన్నారు.





