నేటి సాక్షి మహబూబాబాద్ (భూక్యా రవి ) : నరసింహుల పేట మండలం లోమృతుడు అయిన జాటోత్ రమేష్, వయసు 35 సంవత్సరములు దుబ్బ తండా, కొమ్ములవంచ గ్రామం, నరసింహలపేట మండలం. నిన్న రాత్రి సమయంలో ఇతను తనకు బొడ్లాడ శివారులో గల వ్యవసాయ భూమిలో పండించిన మొక్కజొన్న పంటను ఇంటికి తరలించేందుకు ట్రాక్టర్లో లోడ్ చేసే క్రమంలో ట్రాక్టర్ యొక్క హైడ్రాలిక్ కేబుల్ ఫెయిల్ అయి ట్రాక్టర్ డబ్బా పైకి లేవగా అది రిపేర్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు డబ్బా ఒక్కసారిగా మృతుని మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందినాడు. మృతుని భార్య జాటోత్ నీల గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది.





