Friday, March 27, 2026

సొంత తమ్ముడిని కోల్పోయా…

  • నిత్యం జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేసే వ్యక్తి రఘు
  • రఘు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటా
  • సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్…

నేటి సాక్షి కోదాడ ప్రతినిధి : రఘు మృతి నిజంగా తీరని లోటు అని సొంత తమ్ముడిని కోల్పోయానని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు. బుధవారం రఘు దశదినకర్మలో పాల్గొని రఘు చిత్రపటానికి ఎలక్ట్రానిక్@ ప్రింట్ మీడియా సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం రఘు కుటుంబ సభ్యులను ఓదార్చరు . రఘు కుటుంబానికి జర్నలిస్టులు అందరం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించే మనిషి కనిపించకపోవడం నిజంగా మనస్సును కలిచి వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట టి యు డబ్ల్యూ జే హెచ్,143 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరికిషన్, నియోజకవర్గ ఎలక్ట్రానిక్@ప్రింట్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News