Wednesday, March 11, 2026

పుట్టిన ఊరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..!

  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..
  • రూ. 2 కోట్ల 3 లక్షలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ..
  • హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా…
  • రాష్ట్ర కో ఆపరేటివ్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి..

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి :
తాను పుట్టిన రుద్రంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంతోపాటు ఉమ్మడి మానాల పరిధిలో రూ. 2 కోట్ల 03 లక్షలతో నూతన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాష్ట్ర కో ఆపరేటివ్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి తో కలసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రజల ఆశీర్వాదం, ప్రోత్సాహం వల్ల రుద్రంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లి బాధ్యత తనదని అన్నారు. రుద్రంగిని ఆదర్శంగా నిలిపేందుకు జిల్లా కలెక్టర్ సహకారాలు అందిస్తున్నారని, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జనవరి 26 నుండి మంజూరు చేయబోతున్నామని పేర్కొన్నారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలకు 238 కోట్లతో 4696 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా రైతులకు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. రుద్రంగి లో మెయిన్ రోడ్డు లో సైడ్ డ్రైన్ ను 1 కోటి 27 లక్షలతో నిర్మాణం చేసుకున్నామని, మన గ్రామంలో రోడ్డు ఎత్తుగా ఉంటే వాటికి అనుసంధానంగా 12 ప్రాంతంలో మైన్ రోడ్డుకు కలిపామని తెలిపారు. కేజీబీవి లో ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు బోర్ వెల్ కూడ మంజూరు చేసుకున్నామని తెలిపారు. జిల్లాలో మొట్టమొదట సరిగా కేజీబీవి విద్యార్థులకు ఐఐటి, జేఈఈ,నీట్ కోచింగ్ కోసం జిల్లా కలెక్టర్ చొరవతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభం చేసుకున్నామని గుర్తు చేశారు. రూ.16 లక్షలతో దసరా, బతుకమ్మ పండుగ సందర్బంగా సెంట్రల్ లైట్స్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రూ. కోటి 50 లక్షలతో అంబేద్కర్ చౌరస్తా నుంచి హనుమాన్ ఏరియా మీదిగా ఇందిరా చౌక్ వరకు సీసి రోడ్డు మంజూరు చేసుకున్నామని తెలిపారు. రుద్రంగి వాసులు చిరకాల కోరిక ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ చేసి ఇప్పటికే పనులు శరవేగంగా  సాగుతున్నాయని, ఆరు నెలల్లో ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో 43 కోట్ల తో మన గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేసుకున్నామని, రామకృష్ణపూర్ పల్లె కు వెళ్ళడానికి 60 లక్షలతో కల్వర్ట్ నిర్మాణనికి భూమి పూజ, అలాగే మర్రిపల్లి, కలికోటా రిజర్వాయరు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చందుర్తి – మోత్కరావుపేట రోడ్డు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామన్నారు. త్వరలోనే మొదటి దశ పనులు ప్రారంభం అవుతాయయని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళ తల్లులను కోటీశ్వర్లను చేయడానికి ఇందిరా మహిళ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. జిల్లాలో 600 కోట్లను మహిళా తల్లులకు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ చెలకల తిరుపతి,ఈఈ సుదర్శన్ రెడ్డి, డి ఆర్ డి వో శేషాద్రి, డి ఈ పవన కుమారి, ఎంపీడీవో నటరాజ్, ఎమ్మార్వో శ్రీలత, ఏ ఈ మనోహర్, మాజీ జెడ్పిటిసి గట్ల మీనయ్య,మాజీ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్, డీసీసీ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్,గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ ఆలయ కమిటీ చైర్మన్ కొమిరె శంకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News