- సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందాం గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం
- మండల స్థాయి కార్యకర్తల సమావేశంలోఎమ్మెల్యే

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను కడవరకు తన గుండెల్లో పెట్టి చూసుకుంటానని ఎవరు కూడా అధైర్యపడవద్దని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు.శుక్రవారం ఖిల్లా ఘణపురంలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన మండలస్థాయి కార్యకర్తల నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని గ్రామాల వారిగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.గ్రామాలలో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించు కుందామని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





