Sunday, March 22, 2026

ఆదాయపు పన్ను ఎగవేత దారులను కట్టడి చేయడం కోసం అధిక మొత్తంలో చేసే లావాదేవీలను గుర్తిండం కీలకము

  • అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : గురువారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తహసిల్దార్లకు అందరికీ అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను గుర్తించి రిపోర్ట్ చేసేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పన్ను ఎగవేత దారులను కట్టడి చేయడం కోసం అధిక మొత్తంలో చేసే లావాదేవీలను గుర్తిండం కీలకమని చెప్పారు. అందులో భాగంగా సిసిఎల్ఏ సూచన మేరకు తహసిల్దార్లు స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ను రిపోర్టు చేయడంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందులో భాగంగా రూ. 30 లక్షల పైన జరిగిన లావాదేవీలను గుర్తించి ఆదాయ పన్ను శాఖకు రిపోర్టు చేయవలసి ఉంటుందని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తాసిల్దారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News