Wednesday, March 11, 2026

బిజెపి మాట ఇస్తే అది నెరవేరుస్తుంది

నేటి సాక్షి,కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి):
భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత ఐదు దశాబ్ధాల కల సాకారం చేస్తూ, భారత దేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ, ఇందురు పార్లమెంట్ ప్రజల ఆకాంక్ష అయిన పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం, కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతులమీదుగా ఉదయం 10 గంటలకు ప్రారంభించడం జరిగింది. పట్టణ బీజేపీ నాయకులు మాట్లాడుతూ “బీజేపీ మాట ఇస్తే అది నెరవేస్తుంది” అని, అది కాశ్మీర్ 370 ఆర్టికల్ విషయమైన, ఇటీవల మొదటి వార్షికోత్సవం అయిన అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం అయిన, ఇప్పుడు పసుపు బోర్డు అయిన, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది. ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. పసుపు బోర్డు కల ఇందురు గడ్డ పైన ప్రకటించిన పూజ్యులు, పసుపు బోర్డు ప్రదాత, భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి మరియు పసుపు బోర్డు ఏర్పాటులో కీలకమైన మన ఇందురు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం, పట్టణ కార్గిల్ చౌక్ వద్ద చేయడం జరిగింది. పసుపు బోర్డును ఇందురులో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పసుపు బోర్డు చైర్ పర్సన్ గా ఎన్నికైన ఎబివిపి నుండి భారతీయ జనతా పార్టీకి విధేయుడు, రైతు బిడ్డ పల్లె గంగారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణరెడ్డి, జిల్లా నాయకులు తిరుమల వాసు, సుధవేణి మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇట్యల నవీన్ కుమార్, చెట్లపెల్లి సాగర్, చిరుమల్ల ధనుంజయ్, పోతుగంటి శ్రీనివాస్, ఇందురి సత్యం, ఆకుల రంజిత్, సొరుపాక రమేష్, చరణ్, తునికి భాస్కర్, ముల్క ఆంజనేయులు, ఎర్ర రాజేందర్, గుద్దేటి రాజేందర్, రైతులుమామిడి పెద్ద మల్లేష్ రెడ్డి, జాగిలం శంకర్, మామిడి చిన్న మల్లేష్ రెడ్డి, గోపిడి రాజేశ్వర్ రెడ్డి, BJYM సడిగే మహేష్, కలలా సాయి చందు, దమ్మ సంతోష్, గిన్నెల అశోక్, గిన్నెల శ్రీకాంత్, తోట దుర్గ ప్రసాద్, చింతకింది గోపాల్ మరియు బీజేపీ కోరుట్ల పట్టణ బూత్ అధ్యక్షులు , శక్తి కేంద్రం ఇన్చార్జిలు, అన్ని మోర్చాల అధ్యక్షులు, ముఖ్య బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News