- సాక్షాత్తు నిజామాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ బహిరంగ వివరణ
నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : గత వారం రోజులుగా నేటి సాక్షి దినపత్రికలో, గంజాయి అక్రమ రవాణా అమ్మకాల పై వరుస వార్త కథనాలు వస్తున్న తరుణంలో సోమవారం రోజు నిజామాబాద్ జిల్లా ఎస్ఇ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరెందుకు నేటి సాక్షి బ్యూరో ఆయన కార్యాలయ ఛాంబర్ లోకి వెళ్లి వివరణ కోరగా, గంజాయి అమ్మకాలు, అక్రమ రవాణా, ఒక ఆప్కారి శాఖకు సంబంధించినదే కాదని, పోలీసు, రెవెన్యూ, యాంటీ నార్కోటిక్ బ్యూరో, ల తోపాటు, అడిషనల్ గా గంజాయి అక్రమ రవాణా కట్టడి, ఎక్సైజ్ శాఖకు వర్తిస్తుందని, నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ పేర్కొన్నారు. వారి పరిధిలోకి వచ్చే వాటి గురించి ప్రశ్నిస్తే, క్లోరోఫామ్ డైజోఫాం నాటు సారా కల్తీకల్లు లతో పాటు నాన్ డ్యూటీ పైడ్ (ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా జిల్లాలోకి తీసుకువచ్చే మద్యం) ఇవి మాత్రమే, తమ పరిధిలోకి వస్తాయని నిజామాబాద్ ఈ.ఎస్ తన వివరణలో తెలిపారు. మరి నిజామాబాదులో, కల్తీకల్లు దందా జోరుగా సాగుతుంది కదా, అందులో క్లోరోఫామ్ డైజోఫాం లాంటి ప్రమాదకరమైన మత్తును కలిపే కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు కదా! అని నేటి సాక్షి బ్యూరో ఎక్సైజ్ సూపర్డెంట్ ను ప్రశ్నించడంతో, 1970 దశకం నుండి ఇది షరామాములేనని, కల్లులో క్లోరోఫామ్, డైజోఫామ్ కల్పకపోతే, ప్రజలకు పిచ్చెక్కుతుందని ఆయన చెప్పారు. ఒక పత్రికా ప్రతినిధికి వివరణ ఇస్తున్న సందర్భాన్ని మరిచి, తన మనసులోని భావాన్ని బహిరంగంగా వ్యక్తపరచడం, కల్తీ కళ్ళు తయారు విధానం సమర్థిస్తూ క్లోరోఫామ్ డైజోఫామ్ అరికట్టడం సాధ్యపడదని, 1970 దశకం నుండే ఇది శరమాములుగా జరుగుతున్న దందా అని ఒక జిల్లా ఆప్కారి శాఖ అధికారి నోట ఇలాంటి మాట రావడం, ఆశ్చర్యనికి గురిచేస్తుంది. అంతటితో ఆగకుండా ! ప్రమాదకరమైన మత్తు పదార్థం క్లోరోఫామ్, డైజోఫామ్ లాంటివి కల్లులో కలపకుండా, కల్తీ కళ్ళు తయారు చేస్తే ప్రజలకు పిచ్చెక్కుతుందని ఆయన అనడం, అక్రమ వ్యాపారులకు ఆప్కారి శాఖ అధికారులకు మధ్య ఉన్న చీకటి ఒప్పందం అక్రమ సంబంధాన్ని బహిర్గతపరచినట్లయింది. నేటి సాక్షి ప్రతినిధి జిల్లాలో ఉన్న లైసెన్స్ కల్లు దుఖన్లు ఎన్ని అని అడిగిన ప్రశ్నకు, ఈఎస్ 394 లైసెన్స్ టిఎఫ్టి షాప్స్ జిల్లాలో నడుస్తున్నాయని తెలిపారు. మరి అన్ లైసేడ్ షాప్స్ ఎన్నో తెలియాల్సి ఉంది. అలాగే జిల్లాలో ఎన్ని డిపోలు ఉన్నాయని ప్రశ్నిస్తే! దానికి సమాధానంగా ఈఎస్ నిజామాబాద్ 114 సొసైటీలు (కల్లు డిపోలు) ఉన్నట్లు తెలిపారు. అసలు లెక్కల్లోకి రాని కల్తీ కళ్ళు తయారు కేంద్రాలు ఎన్ని ఉన్నాయో ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేటి సాక్షి బహిర్గతం చేసే పనిలో ఉంది. గంజాయి, అఫీమ్, బాంగ్ తదితర, ఎన్డిపీఎస్ యాక్ట్ లోకి వచ్చే మత్తును అరికట్టేందుకు, తనకు పేర్లు తెలియని, నాలుగు శాఖలు కేంద్రం పరిధిలో ఉన్నాయని, రాష్ట్ర పరిధిలో మరో నాలుగు ఉన్నాయని ఈ.ఎస్ తెలపటం జరిగింది.
యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పి మీ చిరునామా ఎక్కడ?
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో, గంజాయి, బాంగ్, అఫ్యూమ్, క్లోరోఫామ్, డైజోఫామ్ లాంటి మరికొన్ని ప్రమాదకర, మాదకద్రవ్యాలతో పాటుగా, ఇతర రకాల మత్తు పదార్థాలు, విచ్చలవిడిగా అమ్మకాలు, వాడకాలు పెద్ద మొత్తంలో జరుగుతున్న యని, ఉమ్మడి జిల్లాలలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత నాలుగు నెలల క్రితం, నిజామాబాద్ రెండవ టౌన్ పోలీసులు ఆరు కేజీల గంజాయితో పాటుగా ఒక గంజాయి పేడ్లర్ ను అరెస్ట్ చేశారు. అదే గంజాయి పెడ్లర్ని కొన్ని రోజుల, వ్యవధిలోనే ఆర్మూర్ ఆప్కారి శాఖ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. నందిపేట్ మండలం వెల్మల్ చౌరస్తాలో వాహనాల తనిఖీలో భాగంగా నందిపేట ఎస్సై చిరంజీవి, పోలీస్ సిబ్బంది స్కూటీపై వస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పట్టుకొని వారి నుండి రెండున్నర కేజీల గంజాయిని స్కూటీని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని ఒకటో టౌన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ ఒక ఏ.ఎస్.ఐ గంజాయి దందాలో, యాక్టివ్ గా ఉన్న ఒక స్మగ్లర్ని, రైల్వే స్టేషన్ ప్రాంతంలో, వారం క్రితం పట్టుకొని, 50 వేల రూపాయలకు బేరం కుదుర్చుకొని వదిలేసారని సమాచారం వినిపిస్తుంది. మరి ఇలాంటి విపత్కర సమయంలో యువత, విద్యార్థులు, మత్తుకు బానిసలవుతున్న తరుణంలో, ఓ “యాంటీనార్కోటిక్ బ్యూరో డిఎస్పి” మీ చిరునామా ఎక్కడ అంటూ నిజామాబాద్ కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలే వార్తలుగా, ప్రజల ముందుకు వస్తూ ప్రజాభిమానాన్ని చూడగొంటున్న నేటి సాక్షి రేపటి దినపత్రికలో, కల్తీకల్లు, డైజోఫాం, క్లోరోఫామ్, కళ్ళు ముస్తేదారులు, ఆప్కారి అధికారుల చట్టాపట్టాల్ కథనంతో మళ్లీ కలుద్దాం!





