నేటి సాక్షి, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని పలుపాఠశాలలకు విద్యార్థులు బండ్లపై రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం మాట్లాడుతూ మైనర్లు బండి నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చెయ్యాలన్నారు. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ స్కూల్ విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరం అని సంతాపం తెలియజేశారు. అంతే కాకుండా ఇప్పటి నుండి ఏ పాఠశాల విద్యార్థి అయిన బండి వెసుకొని పాఠశాలకు వస్తే వారి యొక్క తల్లి దండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించాలని అన్నారు. ఇకనుండి పాఠశాలల విద్యార్థులు వాహనాలు వేసుకొని వస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో పాఠశాలల ముందు ధర్నాలు చేస్తామని అన్నారు.





