Friday, March 20, 2026

సమస్య వుంటే మీ శ్రేయోభిలాషులకు తెలియజేయండి

  • వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : విధి నిర్వహణలో గాని లేదా ఏదైనా వ్యక్తిగత సమస్యలతో ఒత్తిళ్లకు గురౌవుతే నీ శ్రేయోభిలాషులకు లేదా నీ స్నేహితులకు తెలియ జేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. విధి నిర్వహణతో పాటు వ్యక్తిగతంగా ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను నియంత్రించడం ఎలా అనే అంశంపై అవగాహన సదస్సు శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌లోని రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు పరిపాలన విభాగం అధికారులు సిబ్బంది పాల్గోన్న ఈ సదస్సుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ నిరంతరం విధులు నిర్వహించే పోలీస్‌ ఉద్యోగులకు విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోనాల్సి వుంటుంది. క్రమ శిక్షణ, ప్రణాళిక బద్దంగా విధులు నిర్వహించడం తో ద్వారా ఈ ఒత్తిళ్లను అధిగమించ వచ్చని. కాని వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని కొన్ని సందర్బాల్లో ఈ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వుంటుందని కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణి కావేశం లో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడుతుందని ముఖ్యంగా క్షణి కావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ గురించి ఆలోచించాలని ఒత్తిళ్లు అధిగమించేందుకు గాను రోజు కొద్ది సేవు వ్యాయామం లేదా యోగకు సమయాన్ని కేటాయించాలని, మీ భావాలను ఇతరులతో పంచుకోండి. ఆరోగ్య కరమైన అహారపు అలవాట్లు చేసుకోవడంతో పాటు, ఆరోగ్యానికి హానీ కలిగించే అలవాట్లకు దూరంగా వుండాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పోలీసులకు సూచించారు. అంతకు ముందుగా నగరానికి చెందిన మనస్తత్వ వేత్తలు డా.జ్యోతి, స్వప్న బెన్‌సన్‌లు మానసిక ఒత్తిళ్లను ఏవిధంగా నియంత్రించు కోవాలని పోలీస్‌ సిబ్బంది, అధికారులకు తెలియజేసారు. ఈ కార్యక్రమములో డిసిపి లు షేక్‌ సలీమా, రవీందర్‌, అదనపు డిసిపి లు రవి, సురేష్‌ కుమార్‌, ఏసిపి లు జితేందర్‌, మధసూధన్‌, నాగయ్య, అనంతయ్య, ఏఓ రామకృష్ణతో పాటు ఆర్‌.ఐలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఎస్‌.ఐ లు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News