Friday, March 20, 2026

అదుపు తప్పితే యమ దారి

నేటిసాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ నుండి గుండ్లపల్లె వెళ్లే మార్గాల్లో రోడ్డు పక్కన ఉన్న బావులతో ప్రమాదం పొంచి ఉందని బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్, వాహనదారులు, అంటున్నారు రోడ్డు ఆనుకొని ఉన్న బావులవద్ద రక్షణ గోడలు,హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన దాకలాలు లేవు. గుండ్లపల్లి నుండి గునుకుల కొండాపూర్ వరకు డబుల్ రోడ్డు కావడంతో నిత్యం వేల సంఖ్యలో మానసా దేవి ఆలయానికి వెళ్లే వాహనాదారులు దూసుకుపోతున్నారు. అదుపు తప్పితే ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని ప్రధాన రోడ్డు పక్కన ఉన్న బావులను గుర్తించి రక్షణ గోడలు హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల వాహనాదార్లు ఇప్పటికే పలుమార్లు కోరిన ఎవరు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ అధికారులను కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News