Wednesday, March 18, 2026

సెల్ ఫోన్లు పోతే సీఈఐఆర్ యాప్ లో నమోదు చేసుకోవాలి -రూరల్ ఎస్సై శ్రీకాంత్

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) :
ప్రజలకు ఎంతో ఉపయోగం ఉన్న సీఈఐఆర్ యాప్ ను వినియోగించాలని, సెల్ ఫోన్లు పోతే అందులో వివరాలు నమోదు చేస్తే పోలీసులు స్వాధీనం చేసుకొని అప్పగిస్తారని రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.శనివారం ఆయన తన పోలీస్ కార్యాలయంలో 12 మంది బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించారు.అనంతరం విలేకరులతో రూరల్ ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థ ద్వారా సిఈఐఆర్ ఆప్ తీసుకొచ్చిందని, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. ఒకవేళ మన సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయిన, పోయినా కూడా సిఈఐఆర్ యాప్ లో వివరాలు నమోదు చేస్తే ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలోని పోలీసులు స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తారని తెలిపారు. గతంలో ఈ యాప్ ద్వారా చాలా మంది బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రభాకర్, రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News