- సీఐ వెంకటేశ్వర్లు
- మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో మరియు పడమటి తండా గ్రామంలో అవగాహన సదస్సు మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…. ఎవరైనా సరే మద్యం సేవించి బైకులు నడిపినట్లయితే.. కఠినమైన చర్యలు అలాగే హెల్మెట్ లేకుండా బైక్ కి ఇన్సూరెన్స్ లేకుండా రోడ్ల పైన తిరిగినట్లయితే వాళ్లపై కేసు నమోదు తప్పకుండా చేస్తాం కొంచెం దూరమే కదా అని చెప్పేసి హెల్మెట్ లేకుండా వస్తే బయటికి అనుకోని పరిస్థితులలో ఏదైనా సంఘటన జరిగినట్లయితే మీ ఇంట్లో భార్య పిల్లలు ఎదురు చూస్తారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. అలాగే ఇన్సూరెన్స్ ఉండాలి, మైనర్ పిల్లలకి ఎవరైతే బైకులు ఇస్తారో. వాళ్ల తల్లిదండ్రుల పై కేసులో తక్షణమే నమోదు చేయడం జరుగుతుంది. మరీ ఎక్కువగా మైనర్ యువత పెద్దపులి నాగారం గ్రామంలో పడమటి తండా గ్రామంలో నందు పల్లి గ్రామంలో బైకులు చాలా వరకు నడుపుతున్నారు. లైసెన్సులు లేకుండా ఇన్సూరెన్స్ లైసెన్స్ లు లేకపోతే మాత్రం తప్పనిసరి చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సై మధు, ఎస్సై రాఘవేందర్, మహేశ్వరం పోలీస్ సిబ్బంది పాల్గొని ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.





