Monday, March 9, 2026

మాటిచ్చారంటే.. చేస్తారంతే…!

  • ప్రజా సమస్యలపై పలాస ఎమ్మెల్యే స్పందన భేష్
  • ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు
  • ఎమ్మెల్యే గౌతు శిరీష

నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : ఎమ్మెల్యే గౌతు శిరీష మాటిచ్చారంటే.. చేస్తారంతే..! అని మరోమారు నిరూపించారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో నర్సిపురం గ్రామంలో ఆమె పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు స్ట్రీట్ లైట్స్, రోడ్లు, మురుగు కాలువల అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వీధిదీపాలను ఏర్పాటు చేయడంతో నర్సిపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (2019 వైసీపీ) గత పాలకునికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని మాటలు చెబుతూ కాలయాపన చేశారని గుర్తు చేసుకుంటూ మాటల మనిషికి చేతల మనస్తత్వానికి ఎంతో తేడా ఉందని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News