- ధనస్వామ్యాన్ని బద్దలు కొడదాం – ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం
- ఓట్లేసి రాజులవుతారో — ఓటు అమ్ముకొని బానిసలు అవుతారో మీరే నిర్ణయించుకోవాలి
- బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలంపల్లి సుధాకర్ గౌడ్
నేటి సాక్షి, మునగాల : ఎన్నికలలో రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బు, మద్యానికి ఆశ పడితే మరో ఐదేండ్లు మోసపోవడం ఖాయమని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలంపల్లి సుధాకర్ గౌడ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రాజకీయాలలో బడుగు బలహీన వర్గాల యువత కీలక పాత్ర పోషించాలని గ్రామాలు అభివృద్ధి కావాలంటే యువత చేతుల్లోనే ఉందని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేసే అభ్యర్థుల అర్హత, నిబద్ధత, సమర్థత చూసి ఓటు వేయాలని సూచించారు. ఓటేసి రాజులవుతారొ అమ్ముకొని బానిసలు అవుతారో మీరే నిర్ణయించుకోవాలని తెలిపారు. ఓటును అమ్ముకుంటే మీ బిడ్డల భవిష్యత్తు అమ్ముకున్నట్లేనని అన్నారు. యువత గ్రామములోని వార్డు ,వార్డుకు తిరుగుతూ.. ఓటర్ల కు ఓటును నోటుకు అమ్ముకోవద్దని అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటు విలువను అందరికీ తెలియజేయాలని సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఓటును అమ్ముకోవద్దని అవగాహన కల్పించాలని అన్నారు. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును నోటుకు అమ్ముకోవద్దని యువత అవగాహన కల్పించాలని తెలిపారు.





