Thursday, March 26, 2026

కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే…. ఉత్తమ ఫలితాలు వస్తాయి

  • ఇంఫాక్ట్ ఫౌండేషన్ జెసిఐ లోకల్ ప్రెసిడెంట్ ప్రముఖ మోటివేషన్ ట్రైనర్ లింగరాజు
  • పదవ తరగతి పరీక్షలపై విద్యార్థులకి అవగాహనా కార్యక్రమం
  • మోటివేషనల్ ప్రోగ్రామ్ ప్రతి విద్యార్థి బాల్యంలోనే ఒక లక్ష్యం పెట్టుకొని ఉన్నత స్థానాలకి ఎదిగేలా కృషిచేయాలి

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు- మన బడి బృందం, అదే గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి యాదగిరి ఆధ్వర్యంలో ప్రముఖ ఇంపాక్ట్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి విద్యార్థులకు పరీక్షలపై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. ఇంపాక్ట్ ఫౌండేషన్ సభ్యులు మరియు జెసిఐ లోకల్ ప్రెసిడెంట్ ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్ లింగరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తూ, అనుకున్న మార్కులు సాదించాలన్నారు. పదవతరగతి విద్యార్థులు భయం వీడి పరీక్షలు రాయాలన్నారు. ఉన్నత లక్ష్యాలని పెట్టుకొని, పట్టుదలతో ముందుకు వెళ్తే జీవితంలో అనుకున్నది సాధించోచ్చానరు. విద్యతో పాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమని ప్రతి విద్యార్థి తమ గురువులు, తల్లితండ్రులు చెప్పిన మాటలు వింటూ మంచి క్రమశిక్షణతో మెలగాలన్నారు. పూర్వ విద్యార్థి, ఇంపాక్ట్ ఫౌండేషన్ సభ్యులు అయినటువంటి యాదగిరి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏకగ్రాతతో చదువుతూ మన తల్లితండ్రుల ఆశయాలని నెరవేర్చాలన్నారు. విద్యార్థుల మొదటి అడుగు పాఠశాలలో ప్రారంభం అవుతుందని, కాబట్టి విద్యార్థులు చదువుని నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న నిర్దేశాలని చేరుకోవాలన్నారు. మన తుమ్మలూరు ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, అలాగే మంచి నైపుణ్యమైన ఉపాధ్యాయులు ద్వారా విద్యని అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాలని ఉపయోగించుకొని మంచి మార్కులు సాధిస్తూ మన పాఠశాలని మండలంలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దెల ప్రతి విద్యార్థి కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఇంపాక్ట్ ట్రైనర్స్ మాధవరెడ్డి, యాదగిరి, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News