- 40 టన్నుల ఇసుకను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు బెజ్జంకి పోలీసులు
నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ శివారులో సోమవారం రోజున జెసిబి నెంబర్ ఏపీ 23ఏఎం 3314 గల డ్రైవర్ రాజేష్ తండ్రి రమేష్ వయస్సు 21 సంవత్సరాలు, గ్రామం లింగారెడ్డిపల్లి మండలం సిద్దిపేట్, జెసిబి ఓనర్ గూడెం శ్రీను, నివాసం: గూడెం, గ్రామం బెజ్జంకి మండలం, ఇరువురు కలసి అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా సుమారు 40 టన్నుల ఇసుకను అక్రమంగా డంప్ చేస్తున్నారని నమ్మదగిన సమాచారం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు బెజ్జంకి పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. బెజ్జంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము,మట్టి అక్రమ రవాణా చేసిన పేకాట,జూదం,గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667445 ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.





