- జమ్మికుంట బస్టాండ్ లోపలికి రావాలన్నా పోవాలన్న ఒకే దారి
- రెండు బస్సులు ఒకేసారి వస్తె రోడ్డు పై ట్రాఫిక్ జామ్
- ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
నేటి సాక్షి, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ వాహనదారులకు ఒక సమస్యగా మారింది. బస్టాండ్ నుండి బస్సులు లోపలికి వస్తూ పోతూ ఉన్న సందర్భంలో ఒక బస్సు కోసం మరొక బస్సు ఆగల్సిందే. ఆ సమయంలో రెండు బస్సులు గనుక ఒకేసారి వస్తే ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ తో నిండిపోతుంది. ఇది ఇలా ఉండగా ప్రతి మంగళవారం జమ్మికుంటలో పశువుల, కూర గాయల మార్కెట్ కొనసాగుతుంది. మిగతా రోజులతో పోలిస్తే మంగళవారం ఒక్క రోజు ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది. పండుగలు ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. అందులోనూ ఫ్లైఓవర్ బ్రిడ్జి బస్టాండ్ కి సమీపంలో ఉన్నందున బ్రిడ్జి క్రిందనుండి వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువ ఉంటుంది. బస్టాండ్ సమీపంలోనే దుకాణాలు, హోటళ్ళు, మెడికల్ షాపులు, రోడ్లపై షాపుల ముందు చిన్న చిన్న వ్యాపారస్తులు నిత్యం ఏదో ఒక వ్యాపారం చేస్తుంటారు. ఇదంతా బస్టాండ్ సమీపంలోని జరుగుతున్నందున దుకాణాల వద్దకు ప్రజలు తమ అవసరాల నిమిత్తం వాహనాలపై వచ్చి రోడ్లపై పార్కింగు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. షాపుల ముందు మరో షాపులు వాటి ముందు వాహనాల పార్కింగ్ ఇలా బస్టాండ్ సమీపంలోనే రద్దీ ఎక్కువగా ఉండడంతో బస్టాండ్ లోపలికి ఒక బస్సు వెళ్లే సందర్భంలో ఇంకొక బస్సు వస్తే ఆ బస్సు డ్రైవరు రోడ్డుపై బస్సు నిడబడాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఆపిన సందర్భంలో ట్రాఫిక్ ఎక్కువగా జామవుతుంది. ఈ వాహనాల రద్దీ గాంధీ చౌరస్తా నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో రెండు బస్సులు గనుక ఆగినట్లయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి కనబడుతుందని, రద్దీగా ఉండే ప్రదేశంలో బస్టాండ్ ఉండడం వలన అది ఒకే మార్గంలో బస్సులు వస్తూ వెళ్తూ ఉంటే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, బస్టాండ్ ను అక్కనుండి తీసేసి మరొక చోటకి మారిస్తే బాగుంటుందని జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అభిప్రాయం.