- చంద్రగిరిలో పార్టీ నేతలకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరామర్శ
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : “నేనున్నాను, మీకేం కాదు ! మీ ఆరోగ్యం కుదుట పడేంత వరకు ఎటువంటి సాయం కావలన్నా నేను చేస్తాను. మీకు మెరుగైన వైద్యం అందించడానికి కూడా పెద్ద ఆసుపత్రిలో నేనే అపాయింట్మెంట్ బుక్ చేసి మీకు కంటి చూపు వచ్చేలా చూస్తాను. అధైర్య పడవద్దు. అంటూ చంద్రగిరి మండలం భారతీ నగర్ లో నివాసం ఉంటున్న వైసీపీ నేత పసల నాగరాజుకు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భరోసా ఇచ్చారు. చంద్రగిరి మండలంలో తన సోదరుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో కలసి శుక్రవారం పర్యటించిన మోహిత్ రెడ్డి ముందుగా నాగరాజు ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గత కొంత కాలంగా షుగర్ వ్యధితో బాధ పడుతూ కంటి చూపు కోల్పోయిన నాగరాజుకు మానసికంగా కుంగి పోవద్దని ధైర్యం కల్పించారు. అతిపెద్ద కంటి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చి ధైర్యం కల్పించారు. అనంతరం చర్చి వీధిలో నివాసముంటున్న వైసీపీ నేత నర్లా నజరత్ ఇంటికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని అడగి తెలుసుకున్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సమాచారం ఇస్తే సాయం చేయడానికి సిద్ధంగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం శ్రీనివాస మంగాపురం చేరుకుని తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు మహేందర్ రెడ్డి ఇటీవల మరణించడంతో ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇలా అనారోగ్యం భారిన పడ్డ పార్టీ నేతలకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నేనున్నానని మీకేం కాదని భరోసా కల్పించడంతో స్థానికంగా పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం నిండుకుంది. ఈ పరామర్శలో స్థానిక పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు వున్నారు.





