- చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి..
- విగ్రహాల ఊరేగింపులో వాహనాలకు విద్యుత్ వైర్లు తగలకుండా అప్రమత్తంగా ఉండాలి..
- చెరువుల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి..
- కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
నేటి సాక్షి, కరీంనగర్:
నవరాత్రులు పూజలు అందుకున్న గణేష్ విగ్రహాల నిమజ్జన వేడుకలను భక్తులు జాగ్రత్తగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సోమవారం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిందని తెలిపారు.
గణేష్ నిమజ్జన వేడుకల్లో పిల్లలు, పెద్దలు మహిళలు అందరు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, పిల్లల విషయంలో తల్లిదండ్రులతోపాటు గణేష్ మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా వాహనాలకు విద్యుత్ వైర్లు తగలకుండా ఆయా మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల నిర్వాహకులు, బాధ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిమజ్జన వేడుకలను ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించుకోవాలని పేర్కొన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. నిర్వాహకులకు, భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. ప్రశాంతమైన వాతా వరణంలో నిమజ్జన వేడుకలు పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు న్నామని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా నిమజ్జన వేడుకలను పూర్తి చేసుకోవాలని నిర్వాహకులకు వెలిచాల రాజేందర్ రావు సూచించారు.

