Thursday, March 19, 2026

ప్రజా భద్రత పై సీసీ కెమెరా ప్రభావం

  • రూరల్ సీఐ శ్రీను

నేటి సాక్షి, బెజ్జంకి: ప్రజా భద్రత పై సీసీ కెమెరాల ప్రభావం ఉంటుందని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను తెలిపారు. మంగళవారం బెజ్జంకి పోలీస్ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బెజ్జంకి మండలంలోని ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమిస్తూ ఆ యొక్క గ్రామాల్లో ప్రజలందరికీ సీసీ కెమెరాల ఆవశ్యకతను తెలియజేస్తూ సీసీ కెమెరాలు పెట్టుకునే విధంగా వారిని చైతన్య పరచాలని కోరారు.ముఖ్యంగా ఆ గ్రామాల్లో ఉండే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు,విద్యావంతులు కిరాణా వర్తక వ్యాపారుల కిరాణా వర్తక వ్యాపార సంఘాలను కలిసి వారిలో చైతన్యం కలిగించే విధంగా మాట్లాడి సీసీ కెమెరాలు స్వతహాగా పెట్టుకోవలసిందిగా కోరాలని,ఆ గ్రామాల్లో గంజాయి ఇతర మత్తు ప్రదార్థాలు,గుడుంబా మరియు ఇతర అక్రమ వ్యాపారాలు పై నిఘా ఉంచాలని,సీఐ పరిధిలో గల బెజ్జంకి మండలాన్ని సీసీ కెమెరాల కు పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని 30 రోజుల్లో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు బిగించే విధంగా కృషి చేయాలని బెజ్జంకి ఎస్సై మరియు సిబ్బంది కి సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News