నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : గోదావరిఖని ప్రాంతంలోని విఠల్ నగర్ నివాసి యువకుడు చంద్రగిరి శ్రీనాథ్ ఇటీవల గుండె పోటుతో మృతి చెందడం జరిగిందని, నేడు శ్రీనాథ్ జన్మదినం. సందర్బంగా జ్ఞాపకార్ధం కొరకు రామగుండం తబితా ఆశ్రమంలోని పిల్లలందరికి కుటుంబ సభ్యులు మద్దెల దినేష్ సౌజన్య రగ్గులు అందజేసి అనంతరం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మద్దెల దినేష్ సౌజన్య మాట్లాడుతూ… చంద్రగిరి శ్రీనాథ్ కల్మషం లేని వ్యక్తి అని అందరితో మంచిగా ఉండే వాడని, సమాజాన్ని ప్రేమించేవాడని, ముఖ్యంగా నిరాశ్రాయులకు, నిరుపేదలకు, అన్నర్థులకు నిరంతరం తన వంతు సహాయ సహకారాలు అందించేవారని, తబితా ఆశ్రమంతో వీడదియని అనుబంధం అని అలాంటి వ్యక్తి శ్రీనాథ్ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ప్రతి ఏటా తన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవ కార్యక్రమాల చేసుకునే వాడని ఈసారి జన్మదినం రోజున మన మధ్య లేకపోవడంతో కుటుంబ సభ్యులంతా దుఃఖసాగరంలో మునుగిపోయారన్నారు. పిల్లలందరికీ రగ్గులు పంపిణీ చేసి అనంతరం భోజనాలు వడ్డించడం జరిగిందన్నారు.





