- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ బాగా ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్
నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలో ఇటీవల మాల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో కొంతమంది మాల సంఘం నాయకులు బీసీలను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే వారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, బీసీ సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్ గురువారం ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేమేంతో.. మాకంతా అనే నినాదంతో సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గత రెండు దశాబ్దాలుగా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న తరుణంలోనే నేడు బీసీల ఐక్యతను గుర్తించిన అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదంతో ముందుకు వెళ్తుంటే, కొంతమంది మాత్రం బహుజన ఐక్యతకు భంగం కలిగించే విధంగా మాట్లాడటం శోచనీయమన్నారు. బీసీలలో ఐక్యత లేదు, వారికి రాజకీయం తెలియదని అనడం బిసి లను అగౌరవపరచడమే అని, వారి వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఇది మాల సంఘం వైఖరేనా, లేదా ఆ నాయకుల సొంత వైఖర అనే దానిని ముందుగా స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీసీ ల రాజకీయ చైతన్యాన్ని గుర్తించే నేడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడికి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా అవకాశం కల్పించడం జరిగిందని, అదేవిధంగా మరో జాతీయ పార్టీ అయిన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ సైతం కేంద్రమంత్రిగా రాష్ట్రం నుంచి బీసీ నాయకుడికి అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. బహుజన కులాలు ఏకమై, బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన తరుణంలో కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బహుజనలంత ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా వారు తమ వైఖరిని మార్చుకొని, బహుజన కులాల పట్ల ఇలాంటి వాఖ్యాలు చేయకూడదని సూచిస్తూ, వెంటనే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.





