నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): ప్రపంచ వాగ్గేమకారుడు, తత్వవేత్త, ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి ఉత్సవాలు కథలాపూర్ మండల కేంద్రంలో ప్రజా గాయకులు బత్తుల నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గద్దర్ సామాజిక న్యాయం కోసం, అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం, అణచివేత, దోపిడీ, బానిసత్వం, వెట్టి చాకిరిల నిర్మూలన కోసం, తన ఆటపాట మాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన గద్దర్, భారత ప్రజల సంస్కృతిక ఆటపాటలకు, చైతన్యం కలిగించిన వ్యక్తిగా గత 50 సంవత్సరాలు అనేక రూపాలలో ప్రతి ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, అంటూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహోన్నతమైన వ్యక్తి, కొంతమంది మతోన్మాదం వాదులు గద్దర్ గురించి అవహేళనంగా మాట్లాడుతూ గద్దర్ కు అవార్డులు ఇవ్వం అని మాట్లాడడం జరుగుతుంది. కానీ భారతదేశంలో కోట్ల మంది హృదయాలలో సుస్థిర స్థానం ఉన్నా వ్యక్తి గద్దర్. ఆయన గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు, అటువంటి వారికి తగిన గుణపాఠం చెప్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు అతి బాబ, దయ్య ప్రశాంత్, కోట శంకర్, జంగం నరేష్, బోడ నాగరాజు, అంబాటి రాధాకృష్ణ, సాగర్, జ్యోతి బాబు, ప్రేమేందర్ తదితరులు పాల్గొన్నారు.





