నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని ఏడో వార్డులో నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ కొలిపాక నిర్మల శ్రీనివాస్ కౌన్సిలర్లు తోట రాజేంద్రప్రసాద్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్ ప్రతాప తిరుమల్ రెడ్డి గంగిశెట్టి రాజు కొలిపాక అజయ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

