నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి):
కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసి మంగళవారం ప్రారంభిస్తున్న సందర్భంగా భారతీయ జనతా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, మరియు జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్డులో భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరియు ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ పసుపు రైతుల ఎన్నో సంవత్సరాల కలను నెరవేర్చిందని మరియు రెండు తెలుగు రాష్ట్రాలకు, భారత దేశ పసుపు రైతులకు బంగారం పండించుకునే రోజు వచ్చిందని, ఎంపీ అరవింద్ కృషి, పట్టుదల వలనే పసుపు రైతుల కల నెరవేరిందని, అలాగే జగిత్యాల జిల్లాకు రెండు నవోదయ పాఠశాల ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఆది పెళ్లి మహేష్, మేకల గణేష్ బీజేవైఎం ఉపాధ్యక్షులు దమ్మ సంతోష్, రాగం శెట్టి సాయి కృష్ణ, నల్ల రాజ్ కుమార్,జలంధర్, భూమన్న, శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు.





