Thursday, April 2, 2026

ఆశ వర్కర్లకు వేతనం పెంచండి

  • మల్దకల్ తహశీల్దార్ సాహిదా బేగంకు వినతి పత్రం

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో తాహశిల్దార్ ఆఫీస్ నందు నేడు ఆశ వర్కర్లు నిరసన తెలుపుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం18000లు.. ఫిక్స్డ్ వేతానం నిర్ణయించాలి. ప్రమోషన్, పిఎఫ్, ఈ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనేపరిష్కరించాలనికోరుతూ…మల్దకల్ మండల పరిధిలో ఉండే ఆశ కార్యకర్తలు అందరూ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆశ వర్కర్లకు ఫీక్షుడు వేతనం 18000/లు ఇవ్వాలని ఇతరత్రా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేసాము అని అన్నారు. సమ్మె సందర్భంగా (09-10-2023న హైదరాబాద్ కోఠి కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించాము అని గుర్తు చేశారు. ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఆశ వర్కర్ల సమస్య పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని వేసిన కమిటీ ఆశల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు అందే విధంగా తగు చర్యలు తీసుకుంటామని ఆనాడు హామీ ఇచ్చారు. డైరెక్టర్ గారి హామీ ప్రకారం అక్టోబర్ 9న ఆశ వర్కర్లు నిరవధిక సమ్మెను విరమించుకున్నారు. వీటితోపాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫొటోలో ఆశ వర్కర్లకు వేతనం పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2024 ఫిబ్రవరి 9న జులై 30న డిసెంబర్ 10న ఆరోగ్యశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశల ధర్నా చర్చల సందర్భంగా ఆరోగ్య శాఖ కమిషనర్ స్పందిస్తూ.. 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని మట్టి ఖర్చులు 50 వేలు ఇస్తామని రిటర్మెంట్ బెనిఫిట్స్ సెలవులు కూడా ఇస్తామని టార్గెట్స్ రద్దు చేస్తామని ఆరోజు నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఇతర సమస్యల పైన ప్రభుత్వం పరిష్కార కోసం కృషి చేస్తామని చెప్పారు. హామీలను ప్రింటెడ్ రిజిస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కూడా ఆశా వర్కర్ల ప్రస్తావన లేవనేతాలని నియోజకవర్గ శాసనసభ్యులను ఆశా వర్కర్లు కోరుతున్నారు. మరియు వెంటనే ఆశ వర్కర్లకు ప్రభుత్వం వేతనం పెంచి ఆదుకోవాలని నేడు మల్దకల్ మండల్ తాహశిల్దార్ ఆఫీస్ ముందు నిరాశన కార్యక్రమం ఆశ వర్కర్లు చేపట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News