Friday, March 27, 2026

భారతీయ స్త్రీ మూర్తులకు చరిత్రలో ప్రత్యేక స్థానం

నేటి సాక్షి, రాయికల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పట్టణంలోని విస్డం హైస్కూల్లో వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలు, మహిళా ఉపాధ్యాయులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విస్డం హై స్కూల్ డైరెక్టర్ నివేదిత రాజు రెడ్డి మాట్లాడుతూ సనాతన భారతీయ సంస్కృతిలో స్త్రీని మాతృమూర్తి గా శక్తి స్వరూపిణిగా జగన్మాతగా గౌరవించే సంప్రదాయం అనాదిగా ఉందని అందుకే “యాత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతా:” స్త్రీలను పూజిస్తే దేవతలు కూడా సంతోషిస్తారని పెద్దలు ఉద్భోదించారన్నారు. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని ఐక్యరాజ్యసమితి చెప్పినట్లుగా మహిళా సాధికారత ఇంకా అవసరమన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News