Wednesday, January 21, 2026

ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం..!

  • అన్నదాతకు అండగా ప్రజా ప్రభుత్వం
  • భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు..
  • రైతు భరోసా 12 వేలకు పెంపు
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : బురద నుండి బువ్వ తీసే అన్నదాతకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తో కలసి మిడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ… గత ప్రభుత్వం కేవలం రూ. 10 వేల రైతు బంధు ఇచ్చిందని అంతకంటే ఎక్కువగా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది ఎకరానికి రూ. 12 వేల చొప్పున రైతులందరికీ పెట్టుబడి సాయం చెల్లించాలని నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. ఎలాంటి షరతుల్లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ప్రతీ ఎకరానికి రైతు భరోసా చెల్లిస్తామన్నారు. గత ప్రభుత్వం చెల్లించినట్లుగా రాళ్లు రప్పలు, రోడ్లు రహదారులకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా వర్తించదని వ్యవసాయ యోగ్యం కాని భూములకు (మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ కూడా భూములు,వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ జనవరి 26 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకుని అదే రోజు నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆర్థికంగా అదుకునేందుకు కొత్త పథకం అమల్లోకి తెచ్చిందని,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు నగదు ఆర్ధిక సాయం పంపిణీ చేస్తుందన్నారు.జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఘనంగా ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల నుంచి 17 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు ఉంటాయని అంచనా వేసిందని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నరని అన్నారు..భూమి లేని పేదలను ఆదుకోవాలని ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, మార్కెట్ కమిటీ డైరక్టర్ గోపిడి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గట్ల మీనయ్య, నాయకులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రం గంగా నర్సయ్య, తర్రె మనోహర్, జక్కు వంశీ, జక్కు మోహన్, లక్ష్మణ్, లింగారెడ్డి, రమేష్, మాడిశెట్టి అభిలాష్, ఏర్రం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News