Friday, March 13, 2026

అర్హులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందివ్వాలి

  • బిఆర్ఎస్ మండల నాయకులు పెంచాల మధు

నేటి సాక్షి, మందమర్రి:- మండలంలో భూమి లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని బిఆర్ఎస్ మండల నాయకులు పెంచాల మధు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలి కుటుంబానికి, భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని అన్నారు. భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఆత్మీయ భరోసా అందే లాగా జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. జాబ్ కార్డు ఉన్న వారిలో 20 రోజులు పని చేసి ఉన్న వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News