నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలంలోని రామ్ సాగర్ గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయబడిన ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. జనవరి 26వ తేదీన ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది లబ్ధిదారుల్లో కలెక్టర్ నుండి మంజూరు చేయబడిన వాటిలో ఈరోజు నలుగురు లబ్ధిదారులకు ఇల్లు నిర్మించ నిమిత్తం మార్కోట్ ఇవ్వడం జరిగింది వీరికి బేస్మెంట్ లెవల్లో లక్ష రూపాయలు. రూఫ్ లెవెల్ లో లక్ష రూపాయలు. స్లాబ్లెవల్లో రెండు లక్షలు. చివరగా కంప్లీషన్ అయ్యాక లక్ష రూపాయలు. చొప్పున మొత్తం ఐదు లక్షలు ఇవ్వబడతాయి మిగతా లబ్ధిదారులు వారు సర్వేలో చూపించిన స్థలం సిద్ధం చేసుకున్న తరువాత ప్రారంభించబడతాయని వారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో. ఎంపీడీవో. ఏఈపిఆర్.పంచాయతీ కార్యదర్శి. పాల్గొనడం జరిగింది.





