నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : కనీస వేతనాల పెరుగుదల కొరకు 22న చలో హైదరాబాద్ సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం ఎన్టీపీసీ సిఐటియు ఆఫీసులో జరిగింది. ఇందులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యవసర సరుకుల, వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26000 నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మార్చి 22న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ఎన్టిపిసి, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, బసంత నగర్ పరిశ్రమల్లో పనిచే స్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లలో కనీస వేతనాల డ్రాఫ్ట్ జిఓలను 2024 జనవరి 29న విడుదల చేసిందని, వేతనాలు నిర్ణయం ఆశాస్త్రీయంగా చేసింది. ఉన్న కరువు భత్యం (విడిఏ)ను ప్రస్తుతం పొందుతున్న బేసిక్ వేతనంలో కల్పారే తప్ప కొత్త డ్రాఫ్ జిఓలలో ఒక్క పైసా పెంచలేదు. ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జిఓలను సవరించాలని, కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలుగా నిర్ణయించి అమలు చేయా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సిన జిఓల కాల వ్యవధి ముగిసి 12 నుంచి 18 సంవత్సరాల కాలం గడిచినా సవరించ లేదు అన్నారు. దీనితో రాష్ట్రంలో కోటి 20 లక్షల మంది కార్మికులు, పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి, ఎన్టీపీసీ, రైస్ మిల్, రైల్వే, ఆర్ ఎఫ్ సి ఎల్, బసంత నగర్, తదితర రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. చివరిసారిగా బిఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ఐదు రంగాలకు రూ. 18,019/- గా సవరించి 5 జిఓలను విడుదల చేసి గెజిట్లో ముద్రించకుండా తొక్కిపెట్టి అమలు చేయలేదు. దీనిపై హైకోర్టులో ఫీల్ వేయగా గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు జీవన నోటిఫికేషన్ వారాల్లో అమలు చేయాలని ఆదేశించింది అయినా కూడా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకొని, ఐదు నోటిఫికేషన్లు ఇచ్చిన జీవోలను గెజిట్ చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగే ఈ ధర్నాలో వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు గిట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, నాయకులు ఎం, రామాచారి, కే, పురుషోత్తం,A రమేష్ తదితరులు పాల్గొన్నారు.





